
ఉన్నత చదువులు చదివి దేశానికి ఆదర్శం అవ్వాలి-మున్సిపల్ చైర్ పర్సన్ అనిత రామకృష్ణ
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ లు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదరికం పోవాలంటే ఉన్నత చదువులు చదువుకొని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరును సంపాదించి సమాజంలో మీ వంతు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ దేశాన్ని ముందుకు నడపాలని ఈ దేశానికి కాబోయే పౌరులు మీరేనని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పాలకుర్తి గోపి,కౌన్సిలర్స్ నల్లెల్ల జ్యోతి అనిల్,పసుల లావణ్య రమేష్,శనిగరపు రజిని నవీన్,కో ఆప్షన్ మెంబర్ ముఫీనా ఫాతిమా,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేందర్,పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.