చేర్యాల నేటి ధాత్రి…
ఇంటింటా ఇన్నోవేటర్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ – 2024 లో భాగంగా….మన రాష్ట్రంలో 20 జిల్లాల్లో 44 మందికి ఇన్నోవేటర్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 44 ఇన్నోవేటర్స్ లో భాగంగా నర్సాయ పల్లి గ్రామానికి చెందిన శామంతుల. అనిల్ కుమార్ తను ఆవిష్కరించిన పాడి స్ప్రింగ్స్ వెదర్ కి అవార్డ్ రావడం జరిగింది.
ఇట్టి అవార్డు ను గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. సర్పంచ్ లలిత మరియు ఉప సర్పంచ్ ఎల్లయ్య ,వార్డు సభ్యుల చేతుల మీదుగా,గ్రామ పెద్దలు,ప్రజల సమక్షంలో శాలువా కప్పి అవార్డు తో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్, ఆశ వర్కర్లు రజిత, రేణుక, అంగన్వాడి టీచర్ సునీత, మరియు సిఏలు రేణుక, స్రవంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
