
పరకాల నేటిధాత్రి
గురువారం రోజున పరకాల పట్టణంలోని గణపతి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలలో భాగంగ యువకులతో కలిసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ చందర్ రెడ్డి,డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్,పరకాల కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నవ ఓటర్లను ఉద్దేశించి మార్గ నిర్దేశం చేశారు.భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్రం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భారతదేశాన్ని 2047 అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి యువత ప్రముఖ పాత్ర వహించాలని కోరారు.వికసిత భారత్‌గా చేయాలనే సంకల్పాన్ని తీసుకునే విధంగా పాల్గొన్న యువకులందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మార్త బిక్షపతి,ఆర్పి జయంత్ లాల్,బెజ్జంకి పూర్ణ చారి,దేవునూరి మేఘనాథ్,మార్త రాజభద్రయ్య,గాజుల నిరంజన్,కుక్కల విజయ్, దుబాసి వెంకటస్వామి, ఎరుకల దివాకర్,పగడాల రాజ్ కుమార్,పిట్ట వీరస్వామి, కాసాగాని రాజ్ కుమార్,మెంతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.