
పంచాయతీ కార్యదర్శికి కాలనీ వాసుల వినతి
చేర్యాల నేటిధాత్రి…
ఆకునూర్ గ్రామ డబుల్ బెడ్ రూం ఇండ్లకు త్రాగు నీటి సరఫరా చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు. గురువారం డబుల్ బెడ్ రూం కాలనీ వాసులతో కలిసి ఆకునూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి పులి బాలయ్య కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పరిధిలోని ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసముంటున్న కాలనీవాసులకు గత కొన్నాళ్లుగా మిషన్ భగీరథ నీరు సక్రమంగా రాక బోరు బావుల నుండి నీరు తెచ్చుకుంటూ తాగునీటి సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. డబల్ బెడ్ రూమ్ కాలనీవాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే గ్రామపంచాయతీ వాగు నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కాలనీ వాసులు అనుముల చంద్రకళ, తుంగ సౌజన్య, వేముల కళావతి, బోయిని పోచవ్వ, తుంగ సుశీల, జనగాం నిర్మల, సూరబోయిన పద్మ, శనిగరం రమ, జంగిటి జ్యోతి, మల్లం శారద, ఎండీ. జరీనా, వేముల కనకయ్య, మల్లం కనకయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.