నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
ఆర్డిఓ రమాదేవి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా సమకృత కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నేటిధాత్రి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డీవో రమాదేవి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్రమౌళి చేతుల మీదుగా నేటిధాత్రి దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
నేటిధాత్రి ” దినపత్రిక నిజాలను నిర్భయంగా ప్రచురించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం అభినందనీయం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రజలను చైతన్య పరిచేందుకు పత్రికలు అనునిత్యం పని చేస్తుంటాయని అన్నారు. ప్రజలను చైతన్య పరచడంలో ముందుంటున్న ” నేటిధాత్రి ” దినపత్రిక యాజమాన్యాన్ని, రిపోర్టర్ల బృందాన్ని అభినందించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే పత్రికలు ప్రజలను చైతన్యవంతం చేయడంలో పోటీతత్వం కలిగి ఉండాలని ప్రజా సమస్యలను తమ పత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్న ” నేటిధాత్రి ” దినపత్రిక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి శైలజ ఎస్సీ సంక్షేమ అధికారి సునీత డిపిఓ ఆశాలత సామ్యూల్ స్థానిక ఎమ్మార్వో శ్రీనివాస్ గణపురం రిపోర్టర్ బాబు సదానందం తదితరులు పాల్గొన్నారు