శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క

వేములవాడ నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర మంత్రి హోదాలో తొలిసారిగా మంత్రి సీతక్క దక్షిణ కాశీక ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి వచ్చారు. రాజన్న ఆలాయానికి వచ్చిన మంత్రి సీతక్కకు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనం కల్పించారు. అనంతరం అద్దాల మండపంలో స్వామి వారి చిత్రపటం ప్రసాదం వారికి అందజేశారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!