
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో రెండు కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే కాసేపు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. నూతన బస్ సర్వీసులను భూపాలపల్లి టు మేడారం, భూపాలపల్లి టు భద్రాచలం సర్వీసులను డిపో మేనేజర్ తో కలిసి జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చల్లూరు మధు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బుర్ర కొమురయ్య కౌన్సిలర్ రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.