
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తేదీ 24:01:2024 బుధవారం రోజున జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మమత మంచిర్యాల మహిళ తరంగిణి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దూర ప్రాంతం నుండి స్కూల్ కి వచ్చి చదువుకునే మిట్టపల్లి, కాన్కూర్ బాలికలకు మూడు సైకిళ్లు బహుమతిగా అందించారు. ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ భవిష్యత్తులో అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చు కోవాలంటే బాలికలు విద్యారంగంలో తమ అమూల్యమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కష్టంగా కాకుండా ఇష్టంగా చదువు నేర్చుకోవాలని కోరారు. అలాగే గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత డాక్టర్ చిదానంద కుమారి తమ వంతుగా సైకిల్ విరాళం చేస్తూ భవిష్యత్తులో కూడా తమ వంతు సహాయ సహకారం అందిస్తామని విద్యార్థులు తమ ప్రతిభకు పదును పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. రాజగోపాల్, మమత సొసైటీ అధ్యక్షురాలు శ్రీదేవి, సెక్రటరీ పద్మ, ట్రెజరర్ జ్యోత్స్న సభ్యులు నాగమణి, డాక్టర్ చిదానంద కుమారి గ్రామ సర్పంచ్ దుగుట జ్యోతి మరియు పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.