శభాష్ ఆప్కారి, అంతరాష్ట్ర మద్యం మాఫియా కు కళ్లెం

జిల్లా కేంద్రం నుండి మండలాలకు అంతర్ రాష్ట్ర మద్యం సరఫరా చేసిన మూట.

ప్రధాన సూత్రధారి భూపాలపల్లి వాసి, ముఠాలో ఆరుగురు,

మహాదేవపూర్ మండలం నుండి ఐదుగురు మద్యం ముఠా, అందరిపై కేసు నమోదు.

అంతర్రాష్ట్ర మద్యం ముఠాను పట్టుకోవడంలో ఆప్కారి శాఖ చర్యలు భేష్.

సెక్షన్ 41 వరకే మిత్రమా మరి ఏమన్న చర్యలు ఉంటాయా, కఠిన చర్యలు తీసుకుంటేనే మాఫియాకు కళ్లెం పడుతుంది. మండల ప్రజలు.

మహాదేవపూర్ -నేటి ధాత్రి:

గత 15 రోజుల క్రితం మండలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మద్యాన్ని బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారని సమాచారంతో ఆప్కారి శాఖ దారుడు నిర్వహించి మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతరాష్ట్ర మద్యానికి సంబంధించి మండలంలో పెద్ద మొత్తంలో విక్రయాలు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం కూడా విధితమే, ఇదే క్రమంలో ఆప్కారి శాఖ అంతరాష్ట్ర మద్యం మాఫియా పై చర్యల కొరకు కసరత్తు చేస్తూ చివరికి మూట వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. జిల్లా కేంద్రంతో పాటు మహదేవ్పూర్ మండలంలోని ఐదుగురు ప్రధాన అధ్యక్షులు కలిసి మద్యాన్ని విక్రయించడం జరుగుతుందని నిర్ధారిస్తూ వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అంతరాష్ట్ర మద్యాన్ని సరఫరా చేయడంలో భూపాలపల్లి జిల్లా కేంద్రం తో పాటు మహదేవ్పూర్ మండల కేంద్రంతో పాటు రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

శభాష్ ఆప్కారి, అంతరాష్ట్ర మద్యం మాఫియా కు కళ్లెం.

జిల్లావ్యాప్తంగా సంచలనం రేపిన అంతర్రాష్ట్ర మధ్య మాఫియాకు కళ్లెం పడింది. సుమారు 15 రోజులపాటు శ్రమించిన ఆప్కారి శాఖ అధికారులు చివరికి బెల్ట్ షాపుల నుండి మొదలుకొని సూత్రధారి వరకు చేరి వారిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించడం అనంతరం వారిపై కేసులు నమోదు చేసి సుమారు 5 లక్షల రూపాయల వరకు బైండోవర్ చేయడంతో అంతరాస్య మద్యం ముఠా కథ సమాప్తం అయినట్టే. శాఖపరమైన సమాచారంతో ఆప్కారి శాఖ అధికారులు అక్క సమాచారం మేరకు మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలో శుద్ధి జయలక్ష్మి బెల్ట్ షాప్ ఏర్పాటుచేసి అంతర్రాష్ట్ర మద్యాన్ని విక్రయిస్తున్న సమాచారంతో దాడులు నిర్వహించి మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. అంతరాష్ట్ర మద్యం సరఫరాపై జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారి ఉన్న క్రమంలో ఆప్కారి శాఖ ముఠాను చేజేక్కించు కునే వరకు విచారణ ఇతర బెల్ట్ షాపుల్లో దాడులు నిర్వహించి చివరికి సూత్రధారి వరకు చేరుకొని అంతర్ రాష్ట్ర మద్యాన్ని మండలంలో అలాగే జిల్లాలో సరఫరా కాకుండా చర్యలు తీసుకోవడంలో సఫలీకృతులు కావడం జరిగింది. ఆప్కారి శాఖ సత్వర చర్యలు చేపట్టడంతో శభాష్ అనిపించుకునేలా చేసింది.

జిల్లా కేంద్రం నుండి మండలాలకు అంతర్ రాష్ట్ర మద్యం సరఫరా చేసిన మూట.

ఒక 15 రోజుల క్రితం అంతర్రాష్ట్ర మద్యం సరఫరా మండలంలో జరుగుతున్న విషయం మండల కేంద్రానికి ఆదుకొని ఉన్న మహారాష్ట్ర అలాగే చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తరలిస్తున్నారు అనే ఊహగానాలు పెద్ద ఎత్తున వెల్లివెత్తడం జరిగింది కానీ చివరికి అంతరాష్ట్ర మద్యం సరఫరా పక్క రాష్ట్రాల నుండి కాకుండా నేరుగా జిల్లా కేంద్రంలోని మాఫియా ప్రధాన సూత్రధారి ఉంది మండలాలకు తరలించడం జరుగుతుందన్న విషయం ఆప్కారి శాఖ విచారణలో వెలువడడం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన ఉప్పల శ్రీనివాస్ అంతరాష్ట్ర మద్యాన్ని జిల్లా కేంద్రంలో నిలువ చేసి మహదేవ్పూర్ మండలానికి తరలించడం తోపాటు బెల్టు షాపులకు కూడా అంతర్ రాష్ట్ర మధ్యప్రదేశ్ మద్యాన్ని విక్రయించడంతో మండలంలోని గ్రామాలకు సంబంధించిన బెల్ట్ షాపుల నిర్వాహకులు పెద్ద మొత్తంలో అంతరాష్ట్ర మద్యం ను కొనుగోలు చేసి గ్రామాల్లో మధ్యప్రదేశ్ మద్యాన్ని విచ్చలవిడిగా తక్కువ ధరకే అమ్మకాలు చేయడం జరిగింది.

ప్రధాన సూత్రధారి భూపాలపల్లి వాసి, ముఠాలో ఆరుగురు,

ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే విధంగా లైసెన్స్ పొందిన మద్యం షాపుల విక్రయాలను జరగనివ్వకుండా అంతరాష్ట్ర మద్యం తక్కువ ధరకు పెద్ద మొత్తంలో మండలంలో సరఫరా చేయడంతో లైసెన్స్ మద్యం విక్రయాలు పెద్ద మొత్తంలో పడిపోవడం కూడా జరిగింది. ఇలాంటి క్రమంలో ఆప్కారి శాఖకు వచ్చిన సమాచారం మేరకు మహదేవ్పూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపుపై ఆప్కారి శాఖ దాడులు నిర్వహిస్తే అంతరాష్ట్ర మద్యం విక్రయాలు జరగడం వాస్తవమేనని బయటపడడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఆప్కారి శాఖ కసరత్తు ప్రారంభిస్తే ముఠా గుట్టు రట్టు కావడం జరిగింది. జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మహదేవ్పూర్ మండల కేంద్రానికి చెందిన రామగిరి సజ్జన్ సబ్ డిస్ట్రిబ్యూటర్ గా మండలంలో మధ్యప్రదేశ్ మద్యం ను విక్రయాలు చేస్తున్నాడని విచారణలో బయటపడడం జరిగింది. అంతరాష్ట్ర మద్యం విక్రయాల ముఠాకు సంబంధించి మహదేవ్పూర్ మండలం తో పాటు జిల్లా కేంద్ర నికి చెందిన వ్యక్తితో కలుపుకొని ఆరుగురు వ్యక్తులపై ఆప్కారి శాఖ కేసులు నమోదు చేయడం జరిగింది.

మహాదేవపూర్ మండలం నుండి ఐదుగురు మద్యం ముఠా, అందరిపై కేసు నమోదు.

మధ్యప్రదేశ్ అంతరాష్ట్ర మద్యం సరఫరాకు సంబంధించి ముఠా గుట్టు రట్టు చేసిన ఆప్కారి శాఖ గుద్ధ మొత్తంలో దాడులు నిర్వహించడం మండలంతోపాటు జిల్లా కేంద్రం నుండి అంత రాష్ట్ర మద్యం రవాణా తోపాటు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అంతరాష్ట్ర మద్యం పెద్ద మొత్తంలో విక్రయాలు జరుపుతున్న క్రమంలో ఆప్కారి శాఖ దాడులు మరియు విచారణలో మహాదేవపూర్ మండలానికి చెందిన ఐదుగురు వ్యక్తులపై సి ఆర్ పి సి 41 కేసులు నమోదు చేయడం జరిగింది. అంతరాష్ట్ర మద్యం విక్రయాలకు సంబంధించి మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి రామగిరి సజ్జన్, శుద్ధి విజయలక్ష్మి కుదురుపల్లి, సున్నారి రమేష్ కుదురుపల్లి, టి శ్రీనివాస్ సూరారం, గన్నారపు శంకరయ్య సూరారం లపై ఆప్కారి శాఖ కేసులు నమోదు చేయడం జరిగింది.

అంతర్రాష్ట్ర మద్యం ముఠాను పట్టుకోవడంలో ఆప్కారి శాఖ చర్యలు భేష్.

జిల్లావ్యాప్తంగా సంచలనం రేపిన అంతర్రాష్ట్ర మద్యం సరఫరా గత 15 రోజులుగా ఒకవైపు మద్యం ప్రియులకు ఒక రకమైన భయాన్ని సృష్టించింది, ఎందుకంటే తక్కువ ధరకే అంతరాష్ట్ర మద్యం విగ్రహాలు జరపడంలో మతల వేమిటని ఆమధ్యం ఏమైనా ఎక్స్పర్ మద్యమా లేక కెమికల్ తో తయారుచేసిన మధ్యాన్ని అంతర్ రాష్ట్ర లేబుల్ ను పెట్టి విక్రయాలు జరిపారా అలాంటి మద్యం సేవిస్తే తమకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమోనని తక్కువ ధరకు వచ్చిన మద్యాన్ని సేవించి తమ ఆరోగ్యానికి హాని కలుగుతుందేమో అన్న భయం మద్యం ప్రియుల్లో ఎక్కువగా కనిపించింది. ఏది ఏమైనప్పటికీ కానీ ఆప్కారి శాఖ అంతరాష్ట్ర మద్యం మాఫియా పై కఠినమైన నిఘాలు పెట్టి సత్వర చర్యలు చేపట్టి మద్యం విక్రయ దారుల నుండి సమాచారాన్ని సేకరిస్తూ ప్రధాన మూట వ్యక్తులకు వద్దకు చేరుకొని కేసులు నమోదు చేయడం ప్రస్తుతం అంతర్రాష్ట్ర మద్యం బెల్ట్ షాపులు సమాప్తం కావడం తో ఆప్కారి శాఖ చర్యలు భేష్ అని కూడా అనక తప్పడం లేదు.

సెక్షన్ 41 వరకే మిత్రమా మరి ఏమన్న చర్యలు ఉంటాయా, కఠిన చర్యలు తీసుకుంటేనే మాఫియాకు కళ్లెం పడుతుంది. మండల ప్రజలు.

అంతర్ రాష్ట్ర మద్యం మాఫియా పై కొరడా కురిపించిన ఆప్కారి శాఖ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ తో పాటు మహాదేవపూర్ మండల కేంద్రానికి చెందినరామగిరి సజ్జన్, శుద్ధి విజయలక్ష్మి, సున్నారి రమేష్ , టి శ్రీనివాస్, గన్నారపు శంకరయ్య, లపై ఆప్కారి శాఖ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41 ను నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 41 తో అంతర్ రాష్ట్ర అక్రమ మద్యం సరఫరా ముఠా అక్కడితో ఆగిపోతుందా అనే విషయానికొస్తే ఐదు లక్షల బైండోవర్ కూడా చేయడం జరిగింది కానీ వీటితో ఆ మాఫియా అంతరాష్ట్ర మద్యం సరఫరా చేయడం ఆగిపోతుందా అనే ప్రశ్న ప్రజల్లో మిగిలే ఉంది. ఎందుకంటే సెక్షన్ 41 మెజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా అరెస్టు చేయడంతో పాటు అశ్వినియో సమాచారం సహితుకమైన అనుమానం ఉండి లేదా పోలీస్ కస్టడీ నుండి తప్పించుకుపోయిన వ్యక్తులకు అలాగే దలాల నుండి తిరిగి వచ్చి అనుమానాలు వ్యక్తం అవుతున్న వ్యక్తులకు జైలు నుండి విడుదల అయిన వ్యక్తి సెక్షన్ 350 సబ్ సెక్షన్ 5లో ఏదైనా నియమాలను ఉల్లంఘించిన వ్యక్తులకు సెక్షన్ 41 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ తీసి ప్రక్రియ ఉంటుంది. కానీ ఆప్కారి శాఖ గత 15 రోజులపాటు కష్టపడి ఒక పెద్ద ముఠా గుట్టును రట్టు చేసి సాక్షాలతో దొరికినప్పటికీ సెక్షన్ 41 నమోదు చేయడం వెనుక మతలబు ఏమిటి అని ప్రజలు చెప్పుకోక తప్పడం లేదు. అంతరాష్ట్ర మద్యం సరఫరాలో సాధారణ కేసులు నమోదు చేసి రెండవ చేస్తే తిరిగి యధావిధిగా అంతరాష్ట్ర మద్యాన్ని సరఫరా చేయడంలో వారికి మరింత ఆప్కారి శాఖ సహకరించినట్టు అవుతుందని కూడా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం అంతర్రాష్ట్ర మద్యం సరఫరా లో నిందితులుగా ఉన్న వారు తమ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగకుండా ఉంటారని నమ్మకం కూడా లేదని ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. అంతరాష్ట్ర మద్యం ముఠాకు సంబంధించి ఎక్సైజ్ కమిషనర్ మరింత దృష్టి సాధించి ముఠాపై దిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మండల మరియు జిల్లా ప్రజలు కోరడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *