https://epaper.netidhatri.com/
అలవికాని హామీలిచ్చి ప్రజల జీవితాలను తొలి రోజు నుంచే తలకిందులు చేసిన కాంగ్రెస్ పార్టీకి ‘‘ఆరు గ్యారెంటీలే’’ ‘‘ఉరితాళ్లు’’గా మారుతాయంటున్న సిద్దిపేట ఎమ్మెల్యే ‘‘హరీష్ రావు’’, నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో ప్రజలు పడుతున్న బాధలు వివరించారు. ఆ విషయాలు
‘‘హరీష్ రావు’’ మాటల్లోనే..
`అన్నింటికీ ఒకటే మంత్రం..
`అధికారంలోకి వచ్చిన మరుక్షణం..
`3 న గెలిస్తే 9 నే అన్ని ఆరు హామీలు అమలు చేస్తాం అన్నారు.
`నవంబర్ లోనే కరెంటు బిల్లు కట్టొద్దన్నారు.
`సోనియా గాంధీ కరెంట్ బిల్లు చెల్లిస్తుందని చెప్పారు.
`ఇప్పుడు వందరోజుల సమయం అడుగుతున్నారు.
`రైతుబంధు బుడిబుడి అడుగులు.
`రుణమాఫీపై కట్టు కథలు..
`నిరుద్యోగ భృతికి తిలొదకాలు.
`ఉద్యోగాలు ఇప్పటికైతే వాయిదాలు.
`కాంగ్రెస్ ని జనం క్యా మతలబ్ హై అంటున్నారు.
హైదరబాద్,నేటిధాత్రి:
జీవితమంతా అధర్మ పాలన చేసిన దుర్యోధనుడు కూడా ఆఖరు నిమిషంలో కూడా పాండవులది అధర్మ యుద్దం అన్నాడట. అలా వుంది కాంగ్రెస్ నాయకుల తీరు. అరవై ఏళ్లపాటు తెలంగాణ ప్రజలను వంచించి, మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అయినా ఒక్క ఛాన్స్ ఒక్క చాన్స్ అంటూ తెలంగాణ ష్ట్రప్రేజలను ప్రాధేయపడితే మరోసారి అవకాశం ఇచ్చినా పాలన సాగించకుండా, బి ఆర్‌ఎస్‌ను తిట్టడమే పనిగా కాంగ్రెస్ పెట్టుకున్నది. ప్రజా రంజక పాలన పదేళ్లపాటు సాగించిన బిఆర్‌ఎస్ పాలనను ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్‌కు లేదు. ప్రజలను పదే పదే మభ్యపెట్టి ఎన్నికల ప్రచారం చేసింది కాంగ్రెస్ . ఎన్నికలనగానే అలవి కాని హమీలు గుప్పించింది కాంగ్రెస్. అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను తుంగలో తొక్కింది కాంగ్రెస్. ఆరు గ్యారెంటీలని ఊదరగొట్టి, ఇప్పుడు బిత్తర చూపులుచూస్తున్నది కాంగ్రెస్. ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చక వంచిస్తోంది కాంగ్రెస్. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు తెలంగాణ ప్రయోజనాలు కాంగ్రెస్ పట్టలేదు. కాని 2014లో కేసిఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత, బిఆర్‌ఎస్ పాలన వచ్చిన తర్వాత ఎన్నికల ముందు చెప్పినవే కాదు, చెప్పనివి కూడా అనేకం అమలు చేసిన ఘనత మాది. ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలుకు ఆ అరుపులెందుకో అర్ధం కావడం లేదు. ఇంకా బిఆర్‌ఎస్ మీద పొడబొబ్బలెందుకు పెడుతున్నారో వారికే తెలియడం లేదు? పాలించమని ప్రజలు పదేళ్ల తర్వాత అధికారం అప్పగిస్తే బిఆర్‌ఎస్ చేసిందేమిటి అని ప్రశ్నించుకుంటూ కూర్చున్నారు. ఇచ్చిన హమీలు గాలికి వదిలేశారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దాదాపు యాభై రోజలు కావొస్తోంది. ఈ సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమిటి? కాంగ్రెస్ ప్రభుత్వం సాధించేందేమిటి? మూటగట్టి ప్రజలకు పంచిందేమిటి? కాంగ్రెస్‌లో మిడిసిపాటు,మిడిమిడి జ్ఞానం వున్న నాయకులు తప్ప, వివేకవంతమైన నాయకులేరి? కాలం కలిసి వచ్చినప్పుడు ఏవరు ఏది చెప్పినా బాగానే వుంటుంది కాని అబద్దాలతో ఎల్లకాలం కాలం గడపలేరు. ప్రజలను నమ్మించలేదు. అయినా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది నమ్మకం. ఇక భరోసా. ఇచ్చిన హామీల అమలు. అంతే తప్ప కాలయాపన కాదు…ఎన్నికలు అయిపోగానే ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారెంటీల అమలు అని చెప్పిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు వాటని దాట వేసే ధోరణి ఎవరు చేస్తున్నారన్నది ప్రజలకు తెలుసు. బిఆర్‌ఎస్ హాయాంలో ప్రజల నుంచి నిరసన అన్న పదమే ఎక్కడా వినపడిరది కాదు. ఏనాడు ప్రజలకిచ్చిన హమీని బిఆర్‌ఎస్ వదిలేయలేదు. అలవి కాని హామీలు గుప్పించి, అబద్దాలు పదే పదే వల్లెవేసి ప్రజలు మాయ చేసి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తెలంగాణ ప్రజల జీవితాలను తలకిందులు చేసిన కాంగ్రెస్‌కు ఆ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలే ఉరితాళ్లుగా మారుతాయంటన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, నేటి ధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో తెలంగాణ ప్రజల పడుతున్న బాధలు వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…
అన్నింటికీ ఒకటే మంత్రం.
మేం అదికారంలోకి రావాలన్న ఆలోచన తప్ప, అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలా సేవచేయాలన్న సోయి కాంగ్రెస్‌నేతల్లో వుండదు. అది మరోసారి స్పష్టమైంది. ఎంత సేపు అధికార యావతప్ప, సేవ చేద్దామన్న సోయి ఏనాడు వుండదు. ఇప్పుడు కూడా లేదు. అసలు ఏ ధైర్యంతో ఆరు గ్యారెంటీలు ఇచ్చారన్నదానిపై వారిలో ఏ ఒక్కరి దగ్గర సమాదానం లేదు. లంకెబిందెలున్నాయనుకొని వచ్చాం..అంటూ పొంతన లేని సమాదానాలు చెప్పి, తప్పించుకుంటామంటే, మోసం చేస్తామంటే తెలంగాణ ప్రజలు క్షమించరు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటూ ఊకదంపుడు మాటలు అనేకం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు. ఇన్ని సార్లు చెబుతున్నారన్న ఆలోచనతో ప్రజలు నమ్మారు. నమ్మితేనే కదా? మోసం చేసేది అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసానికి తెరతీసింది. ఎన్నికల మందు కరంటు బిల్లులు కట్టొద్దని చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. తెలంగాణ ప్రజల కరంటు బిల్లులు కాంగ్రెస్ పార్టీ కడుతుంది. సోనియా గాంధీ చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పుడు రెండు నెలలు గడుస్తోంది. కరంటు బిల్లుల ఊసు లేదు. అందుకే బిఆర్‌ఎస్ ప్రజలు కరంటు బిల్లు కట్టొద్దని ప్రజలకు సూచిస్తోంది. నల్లగొండ ప్రచారంలో కోమటి రెడ్డి వెంకటరెడ్డి కరంటు బిల్లు కట్టమని ఎవరైనా వస్తే నాపేరు చెప్పమని ప్రచారం చేశాడు. ఇప్పుడు ఆ మాట మర్చిపోయాడు. ఎన్నికల ముందేమో, అధికారం కోసం చెప్పిన మాటేమిటి? ఇప్పుడు వంద రోజులు సమయం కోరడమేమిటి? అప్పుడే అలా చెప్పాల్సి వుండే? కాని అలా చెప్పలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు వేస్తామన్నారు. అంతే కాదు రూ.15వేలు ఇస్తామన్నారు. కాని ఇప్పటి వరకు రైతు బంధు లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేశామంటుంటాడు. ఓ మంత్రి రైతు బంధు పడుతుందంటాడు. మరో మంత్రి వేస్తామంటాడు. ఇందులో ఎవరి ప్రకటన నమ్మాలో ప్రజలకు అర్దం కాకుండాపోతోంది. ఇక ఎన్నికల ముందు రైతులను రెచ్చగొట్టి రుణాలు తెచ్చుకొమ్మన్నారు. రెండు లక్షలు వరకు ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. ప్రజలు,రైతులు రుణమాఫీ గురించి ప్రశ్నిస్తే వాయిదాలు వేస్తున్నారు. ఇదిలా వుంటే జిల్లా సహాకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులను నుంచి వసూళ్లు మొదలు పెట్టాలని ఆదేశాలిస్తున్నారు. అంటే ప్రతి విషయంలోనూ కట్టుకథలే అల్లారని ప్రజలకు అర్ధమౌతోంది. గృహ లక్ష్మిపేరుతో చెప్పిన పధకాలు మూడు. ఉచిత బస్సు ప్రయాణం పేరుచెప్పి ప్రజలకు బస్సులు అందుబాటులో లేకుండాచేస్తున్నారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ది. ఇండ్లకు, సాగుకు అప్పుడే కరంటు కోతలు మొదలుపెట్టారు. అధికారంలోకి రాగానే మొదటి క్యాబినేట్‌లోనే డిఎస్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మెగా డీఎస్సీ వేస్తామన్నారు. ఏడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామన్నారు. అప్పటి దాకా నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామన్నారు. కాని ఏం చేశారు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి గురించి తాము ఏనాడు చెప్పలేదంటూ తొలి సమావేశాలలోనే చేతులెత్తేశారు. అప్పుడే ఈ ప్రభుత్వ పనితీరు అర్దమైంది. ప్రజలకు మోసపోయామని తెలిసిపోయింది. ఇక టిఎస్పీఎస్సీ గురించి అంతంత ఎత్తు ఎగిరిచెప్పారు. ఇప్పుడు వంద రోజుల సమయం అంటున్నారు. మరి రైతులు ఇప్పటికే కరంటు సరిగ్గా రాక పొలాలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్దితి కనిపిస్తోందని బాధపడుతున్నారు. భూ గర్భ జలాలు కూడా తగ్గే పరిస్దితులు కనిపిస్తున్నాయి. గతంలో తాము అధికారంలో వున్నప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఏ ఒక్క చెరువులో చుక్కనీరుతగ్గకుండా చూసుకున్నాం. ఎప్పటికిప్పుడు చెరువులు నింపడం జరిగింది. రైతులకుసాగు నీటి కష్టం రానివ్వలేదు. కరంటు కష్టంతెలియనీయలేదు. కాని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేక పోవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లే పరిస్దితి కనిపిస్తోంది. ఏ రైతులనైతే మోసం చేసి ఓట్లు వేయించుకున్నారో అదే రైతులను నుంచి త్వరలోనే కాంగ్రెస్‌కు నిరసన తప్పదు. కాంగ్రెస్‌కు ప్రజా క్షేత్రంలో ఉరి తప్పదు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలు ఉరితాళ్లుగా మారనున్నాయి. కేవలం అధికారం కోసమే రాజకీయాలు చేస్తే ఇలాగే వుంటుంది. ప్రజల మేలు కోరి చేస్తే అత్యుత్తమ పాలన అందుతుంది. అది కేసిఆర్ పాలనలాగా వుంటుంది.