అభినందించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్!!
ప్రయాణ ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు అందజేత!!!
జగిత్యాల నేటి ధాత్రి
ధర్మపురి నియోజక వర్గం ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బుఖ్య ప్రవళిక జాతీయస్థాయి అండర్ 19 ఎస్ జి ఎఫ్ సాప్ట్ బాల్ పోటీలకు ఎంపిక కాగా ధఈ సందర్భంగా ప్రవళికను సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రయాణ ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రవళిక కు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు
జాతీయస్థాయి అండర్ 19 ఎస్ జి ఎఫ్ సాప్ట్ బాల్ పోటీలకు బుఖ్య ప్రవళిక ఎంపిక
