జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సర్వే నంబర్ 688లో గూడెపు వంశీకృష్ణ అక్రమ కట్టడాన్ని నిర్మిస్తున్నాడంటూ… తక్షణమే సంబంధిత అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలంటూ కోరుతూ.. మాజీ వార్డు సభ్యుడు తూడి రవిచందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గతంలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోని అక్రమ నిర్మాణాన్ని కడుతున్నప్పడికి సంబంధిత అధికారులు చూచి చూడనట్లు వ్యవహరించడం పట్ల తీవ్రస్థాయిలో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పడికి.. అధికారుల లోపల చలనం లేదన్నారు. అక్రమ కట్టడాల పై హౌసింగ్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వరంగల్ అధికారిచే పూర్తి విచారణ చేపట్టినట్లయితే అసలు వస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. స్థానిక కౌన్సిలర్ అండదండలతో అక్రమ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఆయన ఆరోపించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన సంబంధిత మున్సిపల్ అధికారుల పై చర్యలు తీసుకోవాలని రవిచందర్ రెడ్డి కోరారు.