జెండా ఊపి ప్రారంభించిన *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల నేటి ధాత్రి
అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రతిస్టాపన సందర్భంగా సోమవారం రోజున ధర్మపురిలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఈ సందర్భంగా శివాజీ విగ్రహం నుండి,అంబెడ్కర్ చౌరస్తా,పటేల్ చౌరస్తా, బ్రాహ్మణ సంఘం,అంబెడ్కర్ విగ్రహం,గాంధీ చౌరస్తా,నంది చౌరస్తా మీదుగా దేవాలయం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో,పాల్గొన్నారు.అనంతరం శివాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,అయోధ్యలో బాల రాముడు ప్రతిష్ఠాపన సందర్బంగా హిందూ ఐక్య వేదిక ఆద్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని,ధర్మపురి నీ టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని,ఈ నెల 24 న ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామీ ఆలయంలో నిర్వహించే పూర్ణహుతిలో గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతున్నామని,ధర్మపురి ప్రజలు ఏ సమస్య గురించి అయినా నేరుగా తనని కలవవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగన బట్ల దినేష్,మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ,టెంపుల్ ఛైర్మన్ రామన్న,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింహ రాజు ప్రసాద్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగిలి,హిందు ఐక్యవేదిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
