చందుర్తి, నేటిధాత్రి:
ఎన్నో శతాబ్దాల నిరీక్షణకు తెరపడి హిందువుల చిరకాల స్వప్నం నెరవేరిన రోజు భరత భూమిపై అయోధ్య రామయ్య సోమవారం ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాల రాముడు విగ్రహ పునః ప్రాణ ప్రతిష్ట తో గుడిలో కొలువుదీరే ఈ సమయం కోసమే ప్రపంచంలోని ప్రతి ఒక్క హిందువు ఆత్రుతగా ఎదురు చూసిన రోజును పురస్కరించుకొని….. చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని మాధురి సెలక్షన్ అధినేత ఎంజాల నరేష్ – రాజమణి దంపతుల కుమారుడు హరిహరన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతూ తనకున్న ప్రతిభతో అయోధ్య మందిర నమూనాను అట్టలతో తయారుచేసి తన యొక్క ప్రతిభతో భక్తిని చాటుకున్నాడు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు రామ భక్తులు విద్యార్థి హరిహరన్ ను అభినందించారు.
అట్టలతో అయోధ్య రామ మందిర నమోనా తయారుచేసిన మల్యాల జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థి
![](https://netidhatri.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-22-at-12.14.34_1a7f5e1f.jpg)