వస్త్రపరిశ్రమ సంక్షోభానికి కారణం బిఆర్ఎస్ పార్టీ

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ మాట్లాడుతూ మీరు ప్రభుత్వంలో ఉండి 275 కోట్ల రూపాయలు ఎందుకు విడుదల చేయలేదు వస్త్ర పరిశ్రమలో నేత కార్మికుల మీద సైతం కమిషన్లు దోచుకోవడానికి మాక్స్ సొసైటీలను అడ్డం పెట్టుకొని కొత్త పథకాలు సృష్టించి వందల కోట్లు దోచుకున్నారని వస్త్ర పరిశ్రమలో జరిగిన అవకతవకల్లో బి ఆర్ ఎస్ పార్టీ లో ఉన్న పెద్ద మనుషులకు కూడా ముడుపులు ముట్టాయన్నదినిజం కాదా కొంతమంది బడ సేట్ల జేబులు నింపడానికి కొత్త పథకాలు అమలు చేయలేదా వస్త్ర పరిశ్రమ బంధు కావడానికి కారణం మీ ప్రభుత్వమే కదా అలాంటిది బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీ రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధం చేస్తా హామీలు బకాయిలు తెప్పిస్తా అని అనడం వారికి వదిలిస్తున్నామని సిరిసిల్ల అంటేనే చేనేతకు కిల్లా అని ఎంతోమంది పద్మశాలిల కుటుంబాలకు ఉపాధి అందిస్తున్న సిరిసిల్ల గతంలో కాంగ్రెస్ పార్టీఅని 50% సబ్సిడీ ఇచ్చి చేనేతరంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీని సిరిసిల్ల వస్త్ర సంక్షోభంలో ఉన్నందున నేత కార్మికుల సమస్యలను ప్రభుత్వ వీప్ వేములవాడ ఎమ్మెల్యేఆది శ్రీనివాస్ అలాగే సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేసి నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని అలాగే బిఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి నేతన్నలు ఇకనైనా మోసపోకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఎంపిటిసి బై రీ వేణి రాముమండల నాయకులు సామల గణేష్ రాజు రాము జిల్లా యూత్ నాయకులు మునిగల రాజు చుక్క శేఖర్ బాలు సత్తు శ్రీనివాస్ రెడ్డి మైనార్టీ అధ్యక్షులు ఇగ్బాల్ మండల యూత్ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ ముక్కా శ్రీనివాస్ చిలుక శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!