నవభారత్ పత్రిక క్యాలెండరు ఆవిష్కరించిన ఏసిపి మోహన్

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నవభారత్ తెలుగు దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను శనివారం రోజున జైపూర్ ఏసిపి బాలసాని మోహన్ చేతుల మీదుగా క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధి లాగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు అందించడంలో పత్రికలు ముందు ఉంటాయని పేర్కొన్నారు. నిజాలు నిర్భయంగా రాస్తూ మంచి కథనాలతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జి.కరుణాకర్, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్, తిరుపతి, సాయిబాబా, దుర్గన్న పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!