బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లాబోయినిపల్లి మండలం మల్లాపూర్ అనుబంధ గ్రామం రేగులపల్లె లో గొల్ల మరియు కుర్మ సంఘ భావననికి గత శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం విజయం సాధిస్తే గొల్ల కుర్మ సంఘ భవనానికి మల్లాపూర్ గ్రామ వాస్తవ్యులు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వరాల నర్సింగం ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు గొల్ల మరియు కుర్మ సంఘ భవన నిర్మాణానికి యాభై వేల (50000) ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ నాయకులు వరాల నర్సింగం గారి మిత్రబృందంఆధ్వర్యంలో గొల్ల, కుర్మ సంఘ సభ్యులకు అందించడం జరిగింది.
ఈ సందర్బంగా బోయినిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి మాట్లాడుతు
జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వరాల నర్సింగం గారు మానువాడ, మల్లాపూర్, కొత్తపేట గ్రామాలతో పాటు మండలం లో ఎంతో మంది నిరుపేదలకు ఆర్థిక సాయం అందిస్తు ఆపద సమయంలో నేను ఉన్న అని భరోసా కల్పిస్తూ ఈ రోజు గొల్ల కుర్మ సంఘ భవనానికి తన వంతు గా 50000 వేల రూపాయలు ఇవ్వటం చాలా సంతోషం వారికి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ తరుపున మల్లాపూర్ మరియు రేగులపల్లె గ్రామ ప్రజల తరఫున యాదవ సంఘం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ద్వారా కూడా యాదవ సంఘ భవనానికి నిధుల మంజూరుకు మా వంతుగా కృషి చేస్తామని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో బోయినిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి,మల్లాపూర్ గ్రామ ఉపసర్పంచ్ ఆకుల వనిత నాగయ్య ,మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్,వరాల వెంకటేశం,దాసరి బాబు,మాధవ రెడ్డి, ఐల శివరాం. ఐల మహేష్ కృష్ణ గొర్రె కిషన్,జంగిటి బాలయ్య ,రమేష్, మహేందర్, అంజనకుమార్,బత్తిని సంపత్ ,శ్రీనివాస్, జంగిటి సాగర్, ద్వితీయ చంద్ ,మహిళ కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు ఐరెడ్డి రాజ్యలక్ష్మి,మణెమ్మ,యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ గౌడ్,నిమ్మ వినోద్ రెడ్డి, యాదవ సంఘ నాయకులు వట్టే పోచమల్లు,నక్క ఐలయ్య , కోరే కనుకయ్య, రాజు, కనుకయ్య, హరీష్, ఏనుగుల కనుకయ్య, మరియు తదితరులు పాల్గొన్నారు.