
ఉప్పల్ నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్
ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 20
మన దేశానికి రాహుల్‌గాంధీ లాంటి ప్రధాని అవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాలలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో పరిస్థితులు మారాలంటే రాహుల్‌గాంధీ లాంటి నేతనే ప్రధాని కావాలన్నారు.
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు మందుముల పరమేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలువురు నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రాష్ట్రంలో మెజారిటీ పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్ పార్టీగా మనం సొంతం చేసుకోవాలని సూచించారు. అందులో మల్కాజిగిరి కూడా చాలా ప్రధానమైన స్థానంగా గుర్తు చేశారు. మరోసారి మల్కాజిగిరి గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగుర వేసేందుకు అందరూ ఇప్పటి నుంచే కష్టపడి పని చేయాలన్నారు.