*మల్లారం,మర్రిపెళ్లి గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీ పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
*ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మరిపెళ్లి రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభం అవుతున్నాయని అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.
శనివారం వేములవాడ రూరల్ మండలం మల్లారం,మర్రిపెళ్లి గ్రామంల్లో కృతజ్ఞత ర్యాలీలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.
మల్లారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కాంగ్రెస్ జెండా గద్దెను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..
ఇంత గొప్ప విజయాన్ని కట్టబెట్టిన మీకు రుణపడి ఉంటాను అన్నారు.. గతంలో ఉన్నట్టుగానే మీ ఇంటి బిడ్డగానే మీ మధ్యలో ఉంటూ మీకు సేవ చేస్తానని అన్నారు.. పేదప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు..
గత ప్రభుత్వం అభివృద్ధి పేర 6 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్నీ అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత వారికే దక్కిందని అన్నారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేసి కనీసం మున్సిపాలిటీలకు కరెంట్ బిల్లు కట్టలేని దుస్థితిని తెచ్చింది అన్నారు..

ఇక్కడ ప్రాంత సమస్యలపై ఆందోళన చేసిన వాడిగా ఇక్కడి రైతాంగానికి మేలు జరిగే మరి పెళ్లి చెరువు రిజర్వాయర్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అన్నారు.. దీనివల్ల చాలా వరకు గ్రామాల్లో త్రాగునీటికి త్రాగునీటికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యానికి అమలు చేయడం జరుగుతుందన్నారు.. అందులో భాగంగానే మొదటగా మహిళా తల్లులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం,ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంపు జరిగిందని అన్నారు.
