ఎండపల్లి,జగిత్యాల నేటి ధాత్రి
ఎండపల్లి మండలంలోని గుల్లకోట జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు ఇటీవల నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగినటువంటి రాష్ట్రస్థాయి అండర్ 14 సాఫ్ట్ బాల్ విభాగంలో ఉమ్మడి కరీంనగర్ జట్టు తరఫున పాల్గొన్నారు. అందులో ఉత్తమమైన ప్రతిభను కనబరిచి కరీంనగర్ జట్టును తృతీయ స్థానంలో నిలిపారు అని పిఈటి మహేష్,సాయికుమార్ తెలిపారు. వారి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయుడు రామచంద్రం , గ్రామ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి , ఉపసర్పంచ్ బిసగోని శ్రీను, ఎంపీటీసీ శ్రీజ, మల్లేశం, మరియు ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజాప్రతినిధులు ముదిగంటి వెంకట రమణరెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.
రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు గుల్లకోట విద్యార్థులు
