గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని సాయనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తోలెం సాంబయ్య ,వాగబోయిన పుల్లయ్య, వాగబోయిన రాములు, తాటి లక్ష్మయ్య, ఉకే లక్ష్మయ్య, అరేం బిక్షం, బుచ్చయ్య, ఎర్రం పుల్లయ్య ఇర్ప కృష్ణ , చొక్కాయ్య తదితరులు పాల్గొన్నారు.