
బెల్ట్ షాప్ లపై కొరడా ఎప్పుడు
బెల్ట్ షాప్ ల వలన మద్యం బాబుల జేబులకు చిల్లులు
కొత్తగూడెంలో. రాత్రి పది తర్వాత మంచినీరు దొరకదు కానీ మందు దొరుకుతుంది
నిద్రపోతున్న ఆఫ్కార్ .శాఖ మరియు పోలీసులు
రామవరం. త్రీ ఇంక్లైన్. ఫోర్ ఇంక్లైన్. రుద్రంపూర్. ఇలా ఎన్నో గ్రామాలలో. మందు.ఏరులై పారుతుంది
కొత్తగూడెం.ఎమ్మెల్యే.దీనిపై దృష్టి పెడతారా లేదా చూడవలసిన విషయం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. కొత్తగూడెం నియోజకవర్గంలో సుమారు700 పైగా బెల్ట్ షాప్ లు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా ఆప్కారి శాఖ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మునుగోడు ప్రజల్లో ఎంతో సంతోషంగా ఉన్నారు అధికారంలోకి రాగానే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి 24 గంటల్లో నా యొక్క నియోజకవర్గం లో ఒక్క బెల్ట్ షాపు కూడా ఉండదు అని కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ప్రజలు మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరి కొత్తగూడెం మాత్రం దానికి భిన్నంగా ఉంది రాత్రి పది గంటలు దాటిన తర్వాత మంచినీరు దొరకదు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది రాత్రి వేళలో బార్ షాపులు నడిపించే యజమానులు నైట్ కౌంటర్ పేరుతో మద్యం బాబుల జేబులోకి చిల్లులు పడే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక్కొక్క బెల్ట్ షాప్ లో కోటర్ కి 50 రూపాయలు అదనంగా తీసుకుంటూ వ్యాపారం కొనసాగిస్తున్నారు ఇంత తంతు జరుగుతున్నా కూడా ఆప్కారి శాఖకు నిమ్మకి నిరెత్తినట్టు ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తుంది . మరి కొంతమంది అయితే బాహటంగానే మేము సిండికేట్ నుంచి మద్యం తెచ్చుకుంటున్నామని మాకు సిండికేట్ అండదండలు ఉన్నాయని మమ్మల్ని ఆపేవారు లేరు అనే విధంగా బెల్ షాపులు నిర్వహించడం గమనార్థం. మరోపక్క ఉదయాన్నే వైన్ షాపులు తెరవగానే వైన్ షాప్ లలో క్యాషియర్ లా.చేతివాటం బెల్ట్ షాప్ లకి మద్యం తరలిస్తూ ఒక్కొక్క కోటర్ కి 10 రూపాయలు అదనంగా తీసుకుంటూ మద్యం తరలిస్తున్నారు ఇంత జరుగుతున్నా కూడా ఆప్కారి శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదు. బెల్ట్ షాపుల నుండి ఆప్కారి శాఖ కి మరియు పోలీస్ శాఖకి.ఎంత ముడుపులు మూడుతున్నాయి అని తెలియాల్సిన విషయం. మరి వీరిపై మన కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే ఇప్పటికైనా. మహిళలు పడుతున్న బాధలను చూసి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని కొత్తగూడెం మరో మునుగోడు ఎప్పుడు అవుతుందా అని కొత్తగూడెం ప్రజలందరూ కూడా గుసగుసలాడుకుంటున్నారు.