చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా మహా ఘనంగా శ్రీ గోదాదేవి అమ్మవారికి కుంకుమపూజ కార్యక్రమం. నిర్వహించారు ఆలయ అర్చకులు కందాలే వెంకటరమచార్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుంకుమ పూజ కార్యక్రమం శ్రీ గోదాదేవి అమ్మవారికి నిర్వహించడం జరిగిందని తెలిపారు జనవరి 12 నా శుక్రవారం రోజున లక్ష పుష్పార్చన కార్యక్రమం ఉదయం 10 గంటలకు నిర్వహించబడును మరియు తేదీ 13 జనవరి 2024 శనివారం రోజున ఆలయంలో ఉదయం 10 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ హోమం అదే రోజు సాయంత్రం 5 గంటలకు స్వామివారి అమ్మవార్ల ఎదుర్కొన్న ఊరేగింపు కార్యక్రమం మరియు జనవరి 14 భోగి పండగ ఆదివారం రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గోదా రంగనాదుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉదయం 10 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమాలన్నిటికీ భక్తులు ప్రజలు మరియు మహిళలు తదితరులు పాలుకోగలరని కోరారు.
ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు.