
నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని సూరిపల్లి గ్రామంలో తాటి చెట్టు పై నుంచి గాయపడిన కొత్తకొండ రాజు గౌడ్ ను గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంతుల రమేష్ గౌడ్ సోమవారం పరామర్శించారు. ఈ సందర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులకు తాటి చెట్టు పై నుంచి పడి చనిపోయిన, గాయపడిన వారికీ గత ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లిం చడం లేదన్నారు.ప్రమాద వషాత్తు గాయపడిన కొత్తకొండ రాజు గౌడ్ కు ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ పరిహారం తో పాటు అబ్కారీ శాఖ ఎక్స్ గ్రేషియా మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, రాష్ట్ర నాయకులు ధోనికేల సారంగపాణి గౌడ్, మచ్చిక నర్సయ్య గౌడ్, అంబాల రాంగోపాల్ గౌడ్, దొంతి సంతోష్ గౌడ్, పులి ప్రసాద్ గౌడ్, నాంపల్లి వెంకట్ గౌడ్ గౌడ్, మండల అధ్యక్షులు లింగాల వెంకట్ గౌడ్, పల్సమ్ నవీన్ గౌడ్, గ్రామ గౌడ సంఘం నాయకులు కొంకాల రాజు గౌడ్, కోటగిరి సాంబయ్య గౌడ్, పూజరి పెద్ద సాంబయ్య గౌడ్, మాదాటి శ్రీనివాస్ గౌడ్, బత్తిని స్వామి గౌడ్, గడ్డం సంతోష్ గౌడ్, పోశాల సుధాకర్ గౌడ్, పూజరి గోపాల్ గౌడ్, కోటగిరి కొమురయ్య గౌడ్, కొంకాల భాస్కర్ గౌడ్, గడ్డం రాజయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.