గరుడవాహన సేవలో ఊరేగింపు

వేణుగోపాలస్వామిని నగర పురవీధులలో ఊరేగింపు

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

ధనుర్మాసంలో శ్రీ వేణుగోపాలస్వామికి నిర్వహించే గరుడవాహన సేవ నిర్వహించామని వేణుగోపాల స్వామి దేవాలయ బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్షులు ఇరుకుల్ల రమేష్ తెలిపారు. వరంగల్ నగరంలోని ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని ఏకాదశి సందర్భంగా వేణుగోపాల స్వామివారికి గరుడవాహనసేవ నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతి ఇస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. వేణుగోపాలస్వామికి కార్తీకమాసంతో పాటు ధనుర్మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తామని, ప్రత్యేకంగా ఏకాదశి నాడు స్వామికి చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో విశేష సేవలు చేస్తామని బ్రహ్మోత్సవ కమిటీ అధ్యక్షులు ఇరుకుల్ల రమేష్ తెలిపారు. భక్తుల దర్శనార్థం గరుడ వాహన సేవను పురవీధుల్లో ఊరేగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేస్తామని స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరి అందరూ సుఖసంతోషాలతో ఉంటారని ఆలయ అర్చకులు రామాచార్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త వెంకటకృష్ణ, తోట నవీన్ కుమార్ , బెజుగం రజినీకాంత్, దివ్వెల శ్రీనివాస్, దివ్వెల నాగరాజు, పాలరాపు పనేష్, నీలా రాజన్న, ఆకుల సర్వేశ్వర్ రావు, గన్ను సతీష్, బోనగిరి రాజు, అయిత నరేష్,కృష్ణకాంత్ నగబోతు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *