నేటిధాత్రి నర్సంపేట బిగ్ బ్రేకింగ్ న్యూస్..
నర్సంపేట,నేటిధాత్రి :
తను ఉద్యోగం చేస్తున్న రైల్వే స్టేషన్ లోనే రైల్ కింద పడి మృత్యువాత పడ్డాడు ఒక రైల్వే ఎంప్లాయి.ఈ సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో సోమవారం ఉదయం కృష్ణ ఎక్స్ ప్రెస్ సాక్షిగా జరిగింది.స్థానికులు,స్థానిక స్టేషన్ మాస్టర్ తెలిపిన వివరాల ప్రకారం నెక్కొండ మండల కేంద్రానికి చెందిన నాగరాజు నెక్కొండ రైల్వే స్టేషన్ లో రైల్వే ఉద్యోగిగా పనులు నిర్వహిస్తున్నాడు.సోమవారం ఉదయం నెక్కొండ రైల్వే స్టేషన్ కు కృష్ణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రాగానే కింద పడి మృతి చెందాడు.కాగా ఆ సంఘటన ఆత్మహత్యా లేక ప్రమాద వశాత్తూ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాగా మృతుడు
నాగరాజుకు భార్యతో పాటు కుమారుడు,కూతురు ఉన్నారు.అందుకు సంబంధించిన పూర్తి వివరాలు స్టేషన్ మాస్టర్,రైల్వే పోలీసులు వెల్లడించనున్నారు.