నిజం గడపదాటక ముందే….అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వచ్చింది

తీన్మార్ మల్లన్న ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ అయితే నిజమేందో..అబద్దమేంటో తెలుసుకోవాలి

సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేసి BJP,CONG పార్టీలు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు

నీరవ్ మోడీ బ్యాంకులను దోచుకెళ్లి విదేశాల్లో ఉన్నాడు…అతడు ప్రధాని నరేంద్రమోడీకి బంధువైనట్టేనా

కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్

కరీంనగర్ లో మీడియా సమావేశం

ప్రజాక్షేత్రంలో గెలువలేక అబద్దాలు ప్రచారం చేయిస్తున్నారు

ఇరవై ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఒక్క తప్పు చేయలేదు

విలువలతో కూడిన రాజకీయం చేసిన

బోయినపల్లి సరితరావు అనే పేరున్న యువతి నా బంధువుల్లో ఎవరు లేరు

బోయినపల్లి అనే ఇంటి పేరున్న వ్యక్తులు వేల సంఖ్యలో ఉంటారు .

నిజం గడపదాటక ముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అనే మాట వాస్తవమవుతుందని కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు *బోయినపల్లి వినోద్ కుమార్* గారు అన్నారు.

 

కరీంనగర్ లో ఆదివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

 

తెలంగాణ జెన్ కో లో సీఎండీ ప్రభాకర్ రావు గారు బోయినపల్లి సరితరావు అనే యువతికి AE ఉద్యోగం ఇచ్చారని.. నెలకు 1.50లక్షల జీతభత్యాలు ఇస్తున్నారని… ఆ యువతి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారి బంధువు అని మాట్లాడటంతో పాటు

తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ లో ప్రసారం చేశారని పేర్కొన్నారు. … కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు బీజేపీ, కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు ద్రుష్పచారం చేశారు.

 

దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా మిత్రులు, బంధువులు ఫోన్లు చేశారు..వినోద్ మీకు అన్న లేరు అసలు అన్నబిడ్డ ఎక్కడ నుంచి వచ్చారు అని అడుగుతున్నారని పేర్కొన్నారు.

 

జర్నలిస్టులను ఒకే విషయం సూటిగా అడుగుతున్న… ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు అంటే ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా తప్పిదం జరిగితే సరిచేసుకోవాలి.

 

తీన్మార్ మల్లన్న నా వివరణ తీసుకోకుండా క్యూ న్యూస్ లో వార్త ప్రసారం చేశారు.

 

అసలు ఆ ఉద్యోగం ఎవరికి వచ్చింది.. ఎవరు ఇచ్చారనే విషయం నాకు తెలియదు..

 

నీరవ్ మోడీ గారు బ్యాంకు లను ముంచి బయట దేశాల్లో ఉంటున్నారు… నీరవ్ మోడీ మరి నరేంద్రమోదీ గారికి బంధువు అవుతాడా….దీనిపై బండి సంజయ్…బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి.

 

రాజకీయ ప్రత్యర్థులు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి..బండి సంజయ్,అతడి అనుచరులు ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారం చేయడం సరికాదు.

 

ఇలాంటి చిల్లర వ్యవహారం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

తీన్మార్ మల్లన్న దీనిపై సమాధానం చెప్పాలి.

 

2004లో మొదటి సారిగా ఎంపీగా గెలిచాను..ఇప్పటికి 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను..ఇప్పటి వరకు ఒక్క తప్పు చేశానని ఎవరినైనా అడగండి చెపుతారు.

 

ఇప్పటి వరకు చట్టవ్యతిరేక పనులు చేయలేదు. నర్సులు, జూనియర్ ఇంజనీర్ల రిక్రూట్ మెంట్ కోసం నేను వారి తరపున సుప్రీం కోర్టు వరకు వెళ్లడం జరిగింది.

నేను న్యాయం కోసం కొట్లాడే వ్యక్తిని అన్యాయం జరిగే పని ఏనాడు చేయలేను. 

 

ఇంటి పేరును బట్టి ఇలాంటి ద్రుష్పచారం చేయడం సరైన పద్ధతి కాదు.

ఇప్పటికైనా సోషల్ మీడియా మిత్రులు నిజం తెలుసుకుని ద్రుష్పచారం చేయకండి…

 

ప్రచారం చేసే వార్తలో ఎంత వరకు నిజం ఉంది.. ఎంత వరకు అబద్ధం ఉంది అనేది తేల్చుకున్న తర్వాత వార్తలు ప్రసారం చేయాలి.ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే బాగుండదు.

 

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవిందర్ సింగ్, మేయర్ సునీల్ రావు, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి, బీఆర్ఎల్ సీనియర్ నాయకులు జమీల్, చీటి రాజేందర్ రావు, జక్కుల నాగరాజు, ప్రభావతి, మధుసూదన్ రెడ్డి, హరిప్రసాద్, సంపత్ గౌడ్, సాజిద్, శోభ, రేణుక, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *