
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో లో 15వ వార్డులో బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో మంజూరైన సిసి రోడ్డుకు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ మున్సిపల్ ఎ ఇ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాట్లాడుతూ బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో 24 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో డ్రైనేజ్ నిర్మాణం కొరకు మంజూరు అయినాయని చెప్పారు అదేవిధంగా వనపర్తి లో సిసి రోడ్లు వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 50 కోట్లు మంజూరు చేయించారని ఈ నిధులు వాపస్ పోకుండా వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి కృషిచేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ విలేకరుల మున్సిపల్ వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీదర్ మాజి కౌన్సిలర్ తిరుమల్ నాయుడు స్టార్ రహీం చీర్ల శ్రీనివాసులు ఠాగూర్ వార్డ్ బి ఆర్ఎస్ నాయకులు మున్నూరు సురేందర్ ఇంతియాజ్ ముంత మన్యం డానియల్ వినయ్ శివ తదితరులు పాల్గొన్నారు