
ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి
ధర్మపురి నియోజకవర్గ ఎండపల్లి మండలం కేంద్రం అనుకొని కొండాపూర్ నుండి జగదేవ్ పేటకు వెళ్లే దారిలో రోడ్డు గుంతలు గుంతలుగా అక్కడక్కడ రాళ్లురప్పలు తేలి గుంతల మయం కావడంతో వాహనదారులకు ఇబ్బంది తప్పడం లేదు నిత్యం రోజువారిగా రైతులు వాహనదారులు , నిత్యం చాలామంది వివిధ అవసరాల నిమిత్తం రోడ్డు వెంట వెళ్తూ ప్రయాణం చేస్తుంటారు ఈ క్రమంలో రాత్రులు అయితే అసలు రోడ్డు పైన గుంతలు కనిపించకపోవడం అలాగే అక్కడక్కడ ఇటీవల పైప్ లైన్ కొరకు తవ్వకాలు చేపట్టి అలాగే పై పైన మట్టి పోసి, వదిలి వేయడంతో దుమ్ము ధూళితో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి వాహనదారులకు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు