గ్యారంటీల అమలుకు ప్రజా పాలన

*ప్రజల కళ్ళలో సంతోషాన్ని చూడటానికే 6 గ్యారంటీలు

*మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం

*ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం గుండన్నపల్లి గ్రామం లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలోని మహిళల కళ్ళలో సంతోషాన్ని చూడటానికి ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేశారు. మిగిలిన నాలుగు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రానున్న రోజుల్లో మిగిలిన నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తాము.

ప్రజలు పాలనను సద్వినియోగం చేసుకొని దరఖాస్తులు సమర్పించాలి. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా కృషి చేస్తాము.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొప్పుల లక్ష్మి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ , ఎంపీటీసీ అక్కినపల్లి ఉపేందర్ , ఉపసర్పంచ్ బోరు అంజయ్య, జిల్లా సీఈవో గౌతం రెడ్డి, జిల్లా ఆర్డీవో పులి మధుసూదన్, తహసిల్దార్ పుష్పలత , ఎంపీడీవో రాజేందర్ రెడ్డి, మండల సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి ,అధికారులు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!