జిల్లా అదనపు ఎస్పి నరేష్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
యువకులు డ్రగ్స్ బారినపడి జీవితాలను నాశనం చేసుకోరాదని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పి ఏ. నరేష్ కుమార్ అన్నారు. జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఆదేశాలతో భూపాలపల్లి డిఎస్పీ రాములు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జూనియర్ కళాశాల, పాఠశాల విద్యార్థులతో ర్యాలీ తో పాటు, యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చెడు మార్గాలకు దూరంగా ఉండాల న్నారు. డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది జీవితాలు దుర్భరం అయ్యాయని, వ్యసనాలకు బానిసలుగా కారాదన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ విషయం తెలిసిన తక్షణమే పోలీసులకు సమాచారం ఇస్తే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రు ల కష్టాలు గుర్తుపెట్టుకుని క్రమశిక్షణతో చదువుకుంటూ కళాశాలకు మంచిపేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ ఏ. రాములు, భూపాలపల్లి సిఐ రాంనర్సింహా రెడ్డి, ఎ ఎస్ లు సంధ్యారాణి, శ్రీలత, శ్రావణ్, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.