*ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురు గట్ల గ్రామంలో రాచర్ల శ్వేతా అనే అమ్మాయి పెళ్లి ఈ నెల 6 న జరగ నుండగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. పెళ్లికూతురు తండ్రి గత పది సంవత్సరాల క్రితం చనిపోయినాడు. తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు ఎదురుగట్ల సర్పంచ్ సోయినేని కరుణాకర్, రూరల్ మండల్ అధ్యక్షుడు వకలాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ లు ఇట్టి ఆర్థిక సహాయo అందజేశారు. కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ సంపేట గంగరాజు, సోయినేని రాజు, శేఖర్, శ్రీనివాస్, చందు, రవి, లచ్చిరెడ్డి, రమేష్,
పాల్గొన్నారు.