మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి శెట్టి రంగారావు సోదరుడు సుధాకర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే, ఆయన మృతి పట్ల ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, అయితే నేడు ఖమ్మం వచ్చిన వద్దిరాజు రవిచంద్ర శెట్టి రంగారావు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అందరూ ధైర్యంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ ఆకుతోట ఆదినారాయణ పాల్గొన్నారు.