ఏఐటియుసీ కార్మిక సంఘం నాయకులు సీతారామయ్య
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ నేటిధాత్రి:
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సంస్థ సిఎండి బలరాం నాయక్ కు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య మాట్లాడుతూ…కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణిలో హైపర్ కమిటీ వేతనాలను అమలు చేయాలని, జీవో నెంబర్ 22ను వెంటనే అమలు చేయాలనిఅన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ ఆసుపత్రులలో వైద్య సౌకర్యం అందించాలని, గతంలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం బోనస్ పెంచాలని కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధమైన లీవులు, పండుగ సెలవులు కల్పించాలన్నారు. దీనిపై సింగరేణి సిఎండి బలరాం నాయక్ సానుకూలంగా స్పందించి వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె వీరభద్రయ్య, సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అక్బర్ అలీ, రామగుండం రీజియన్ కార్యదర్శి బుర్ర తిరుపతి ,బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్ ,కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి క్రిస్టోఫర్ ,ఇల్లందు రీజియన్ కార్యదర్శి శంకర్, నాయకులు ఎర్రగాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు