వరంగల్ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు గడ్డం సుధాకర్
గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రజల ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యమ కళాకారులకు సరైన న్యాయం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం గడ్డం సుధాకర్ అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో కళాకారుల పాత్ర పాట యొక్క గొప్పతనం ధూంధాం ఉద్యమాన్ని ఊర్రూతలూగించిందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఉద్యమ కళాకారులకు మొండి చేయి చూపించిందని కేవలం 500 మందికి ఉద్యోగాలు ఇచ్చి నిజమైన కళాకారుల పొట్ట కొట్టింది అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్కృతిక సారధిలో ఉన్న కళాకారుల్లో సుమారు 75% మంది కళాకారులు తెలంగాణ ఉద్యమానికి సంబంధంలేని వారని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటాలు కోర్టు కు సైతం వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యమ కళాకారులకు అన్యాయం చేసిందని అందుకే 2023 ఎన్నికల్లో ఉద్యమ కళాకారులు వారి వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారని తెలిపారు. నియంత పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఉద్యమ కళాకారులకి ఈ ప్రజా ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కళాకారులంతా ఐక్యమై ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పాలాటి రాజు, తండా సదానందం, రాజేష్ ఖన్నా, రజినీకాంత్, క్రాంతి, సుహాసిని, రజిత రెడ్డి, వెంకటాద్రి, సతీష్ సుమారు 100 మంది కళాకారులు పాల్గొన్నారు