తంగళ్ళపల్లి నేటి ధాత్రి
వారు తెలిపిన వివరాలు ప్రకారం తంగళ్ళపల్లిమండలం చిర్రావంచ గ్రామానికి చెందిన నిమ్మ రాజేందర్ 2015లో వివాహం జరిగింది వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు రెండు తులాల బంగారం 20 తులాల వెండి 50000. రూపాయలతో ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి జరిపించారు వివాహం అయిన కొద్ది రోజులకే మౌనిక ముందుగానే వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుందని తెలిసి అప్పటినుండి తండ్రి అయిన భూమయ్య మరియు రాజేందర్ వేధించడం ప్రారంభించారు సరిగ్గా తిండి పెట్టకపోవడం బయటకు రానిచ్చేవారు కాదు ఎవరైనా బయట వ్యక్తులు వస్తే మాట్లాడించేవారు కాదు బలవంతంగా ఇంట్లో ఉంచి బయట నుంచి తాళం వేసి ఇంట్లో వేసి బయటకు వెళ్లేవారు రోజు రోజుకి ఆమె ఆరోగ్యం స్కీనించడంతో చుట్టుపక్కల వారు గమనించి 108 అంబులెన్స్ కి ఫోన్ చేయడం జరిగిందని అనగా 20 ఐదు 2018 రోజున సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా మరునాడు 21 5 2018 రోజున మరణించారని ఇట్టి విషయమై మృతురాలు చిన్నమ్మ లక్ష్మీ ఫిర్యాదు మేరకు తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు అప్పటి రూలర్ సిఐ అనిల్ కుమార్ దర్యాప్తుచేపట్టి చార్జి సీట్నీ కోర్టులో దాఖలు చేసినారు ఇట్టి కేసులో cms.si. శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ నరేందర్ 17 మంది సాక్షులు ప్రవేశపెట్టి పబ్లిక్ ప్రాసి క్యూట్ ర్ నర్సింగరావు కేసు పూర్వపరాలు పరిశీలించి సిరిసిల్ల జిల్లా ప్రధాని న్యాయమూర్తి అందజేశారు ఇట్టి పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితుల ఇద్దరికీ 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధించారు ఇట్టి కేసుకు సహకరించిన స్థానిక ఎస్సై కానిస్టేబుల్ ను తంగళ్ళపల్లిమండల ఎస్సై వెంకటేశ్వర్లు అభినందించారు