జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి..
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్కకు శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు…
మంగపేట నేటిధాత్రి
రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క నాయకత్వంలో ములుగు జిల్లా ప్రగతి పథంలో పయనిస్తుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు మంత్రి సీతక్క గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించగా శుక్రవారం కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ లో మంత్రి సీతక్క నివాసంలో కలసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ ములుగు జిల్లాపై సమగ్ర అవగాహనతో గ్రామాల్లో వెలుగులు నిండుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వినయ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తాడువాయి సహకార సంఘం అధ్యక్షుడు పులి సంపత్ మైత్రి గ్రూప్స్ అధినేత సానికొమ్ము వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు