మందమర్రి, నేటిధాత్రి:-
గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) సేవా పరిస్థితులను పరిశీలించేందుకు వేసిన కమలేష్ చంద్ర కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని జిడిఎస్ లు డిమాండ్ చేశారు. జిడిఎస్ ల సమస్యల పరిష్కారానికై జిడిఎస్ ల చేస్తున్న దేశవ్యాప్త సమ్మె గురువారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణంలోని కళ్యాణిఖని పోస్ట్ ఆఫీస్ ఎదుట జిడిఎస్ దీక్ష శిబిరం వద్ద వారు మాట్లాడుతూ, జిడిఎస్ లను శాశ్వత ఉద్యోగులు గుర్తించి, 8గంటల పని విధానం కల్పించాలన్నారు. అదేవిధంగా 12,24,36 సంవత్సరాల ఉద్యోగులకు మూడు ఇంక్రిమెంట్లు కల్పించాలని, పిల్లల విద్య, ఆరోగ్య భీమా కింద గ్రాట్యూటి ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిడిఎస్ లు శంకర్ లింగం, భూమయ్య, జాఫ్రుల్లా ఖాన్, జదవు మంగ, శంకరయ్య, రాజన్న, హమీద్ తదితరులు పాల్గొన్నారు.