ఆనకట్ట మరమ్మతులను వెంటనే చేపట్టాలి
మరిపెడ : నేటి ధాత్రి.
పాలేరు వాగుపై ఆనకట్ట నిర్మింపజేసి వెంటనే సమస్య తీరుస్తామని డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ రాంచందర్ నాయక్ అన్నారు.మరిపెడ మండలంలోని తానంచర్ల గ్రామంలో దగ్గర పాలేరు వాగు ఆనకట్ట గత 10రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి వంతెన పూర్తిగా తెగిపోవడం జరిగింది.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆనకట్ట పరిశీలించిన వెంటనే అధికారులతో మాట్లాడి ఆనకట్ట పనులు మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులో తేవాలని ఆదేశించారు.ఎమ్మెల్యే తో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరా రెడ్డి,ప్రజాప్రతినిధులు,అధికారులు,గ్రామ ప్రజలు,నాయకులు తదితరులు ఉన్నారు.