సాగుకు సాయం అందించండి…..
జిల్లా సరిహద్దు గ్రామాల అభివృద్ధికి తోడ్పడండి…
మంత్రి సీతక్క చొరవతో ములుగు జిల్లా అభివృద్ధి కార్యరూపం దాల్చనుంది….
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి….
నలుగురు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు , పినపాక ఎమ్మెల్యేతో భేటీ….
మంగపేట నేటిధాత్రి
సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు సాగుకు సాయం అందించి ఆదుకోవాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులను కోరారు మంగళవారం ఆయన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నలుగురు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం సుగంధ మిర్చి బహుకరించి నూతన ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారితో భేటీ అయి వ్యవసాయ రంగంలో ఉన్న పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక ప్రణాళిక మరియు ఇంధనశాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ ఉద్యానవనాలు పట్టు పరిశ్రమలు మార్కెటింగ్ జైవ్ లీ చేనేత మరియు సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు లను సాంబశివరెడ్డి కలిసి వారితో భేటీ అయ్యారు ప్రధానంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలు మధ్య తరహా ప్రాజెక్టులు చెరువులు కుంటలను ఆధునికరించాలని గోదావరి జలాలను మళ్లించి బీడు భూములను పంట భూములుగా మార్చాలని వరి పంటకు బోనస్ ధర ప్రకటించి అమలు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సాంబశివరెడ్డి వివరించారు సహకార రంగాన్ని బలోపేతం చేసి రైతాంగానికి మరింత చేరువ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇప్పటికే ఒక ప్రణాళికతో ములుగు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు సాంబశివరెడ్డి తెలిపారు రాష్ట్ర మంత్రులు తుమ్మల బట్టి పొంగులేటి సారధ్యంలో భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలు అభివృద్ధికి వైపు పరుగులు తీస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు పినపాక మండలం టీ కొత్తగూడెం మంగపేట మండలం అకినేపెల్లి మల్లారం జంట గ్రామాల సాగు కోసం గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని దీనికోసం కృషి చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను సాంబశివరెడ్డి విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా మణుగూరు ఆర్టీసీ బస్సు డిపో నుండి టీ కొత్తగూడెం అకినేపల్లి మల్లారం గ్రామాలకు పల్లె వెలుగు బస్సు సర్వీసును ప్రారంభించాలని సాంబశివరెడ్డి ఎమ్మెల్యే పాయం కు విజ్ఞప్తి చేశారు
సుగంధ మిర్చిని చూసి మురిసిన వ్యవసాయ మంత్రి తుమ్మల…
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి బహుకరించిన సుగంధ మిర్చిని చూసి మురిసిపోయారు సుగంధ పంటలకు సంబంధించిన సమాచారాన్ని సాంబశివరెడ్డిని అడిగి తెలుసుకున్నారు మరోసారి తనను తప్పకుండా కలవాలని మంత్రి తుమ్మల సాంబశివరెడ్డిని ఆదేశించారు
ఈ కార్యక్రమంలో సాంబశివరెడ్డి వెంట రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పాడి దామోదర్ రెడ్డి సాంబశివరెడ్డి వ్యక్తిగత సిబ్బంది కార్తీక్ బాలాజీ తదితరులు ఉన్నారు