కార్మిక సమస్యలను పట్టించుకోని టీబీజీకేఎస్
ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్
భూపాలపల్లి నేటి ధాత్రి
సింగరేణి కార్మికుల భవిష్యత్తు కోసం ఈనెల 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీని అధిక మెజారిటీతో గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి రమేష్ పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కేటీకే 6వ గని పై మంగళవారం ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ శ్రీనివాస్ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమం లో బ్రాంచ్ సెక్రటరి మోటపలకుల రమేష్ పాల్గొని మాట్లాడుతూ ఏఐటీయూసీ సాధించిన హక్కుల గురించి కార్మికులందరికీ తెలియజేశాడు.. ఏఐటీయూసీ గెలుపు సింగరేణి భవిష్యత్తుకు అవసరమని, గత పది సంవత్సరాలుగా బి ఆర్ ఎస్ అనుబంధం సంస్థ టీబీజీకేఎస్ కార్మికుల హక్కులను కాల రాసిందని అన్నారు. కార్మికుల సమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వం పేరు చెప్పుకొని మెడికల్ దందాలు పైరవీలకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. యాజమాన్యం పంచన చేరి కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. అదే సంఘం ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ అనుబంధ సంస్థ అయినటువంటి ఐ ఎన్ టి యు సి లో చేరి మళ్లీ కార్మికులను మభ్యపెట్టి పైరవీలు చేసుకోవచ్చని అందులో చేరుతున్నారన్నారు. కార్మికుల మీద కానీ కార్మికుల సమస్యల మీద వీళ్లకు ఎటువంటి అవగాహన లేదని,గత పది సంవత్సరాల నుంచి కార్మికుల తరుపున ఎలాంటి పోరాటం చేయని ఐ ఎన్ టి యు సి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల మీద ప్రేమ కలిగిందని ప్రశ్నించారు. గత ప్రభుత్వ అనుబంధ సంస్థ చేసినట్టుగానే ఐ ఎన్ టి యు సి కార్మికుల సమస్యలు పరిష్కారం కావని అన్నారు.
కార్మికుల పక్షాన నిరంతరం పోరాడే యూనియన్ కార్మికుల హక్కుల సాధించే యూనియన్ కార్మికుల యొక్క శ్రేయస్సు కోరే యూనియన్ కేవలం ఏఐటీయూసీ మాత్రమేనని, 27వ తేదీన జరిగే ఏన్నికలల్లో చుక్క గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రమేష్ కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ విజయేందర్ వైస్ ప్రెసిడెంట్ రామ్ చందర్ బ్రాంచ్ నాయకులు చంద్రమౌళి, రవికుమార్, కృష్ణమూర్తి, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ రాజన్న, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి కుడుదుల వెంకటేష్, గణేష్, లక్ష్మారెడ్డి, గోవర్ధన్, రాంబాబు, హనుమంతు, సత్యనారాయణ, నవీన్, మనోజ్, సత్యనారాయణ, శ్రీనివాస్, మరియు సేఫ్టీ కమిటీ, మైన్స్ కమిటీ, ఏఐటియూసి పిట్ కమిటీ సోదరులు, కార్యకర్తలు, కార్మిక సోదరులు పాల్గొన్నారు.