మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించిన ధర్మపురి శాసన సభ్యులు,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !!
ఎండపల్లి (జగిత్యాల )నేటి ధాత్రి
ధర్మపురి నియోజకవర్గ శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని సోమవారం రోజున ధర్మపురి లోని స్థానిక బస్ స్టాండ్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,మహిళ సాధికారత దిశగా తొలి అడుగు తెలంగాణ స్థానిక మహిళలు విద్యార్థినిలు మరియు ట్రాన్స్ జెండర్స్ కు సదవకాశం టీఎస్ ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్ ప్రెస్ సర్వీసులలో ఉచిత ప్రయానం చేసే విధంగా మరియు మహిళలకు తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఎక్కడినుండి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే గొప్ప పథకం మహాలక్ష్మి పథకమని అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సాయాన్ని పది లక్షలకు పెంచి పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించే విధంగా మరియు అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అమలు చేసే దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేస్తోందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు,ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
మహిళా సాధికారతకు తొలి అడుగు!!!
