బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి.
సివిల్ కేసులను కోర్టులోనే పరిష్కరించుకోవాలి.
జిల్లా ఎస్పీ హర్షవర్ధన్.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
శాంతిభద్రతల పరిరక్షణ లో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ చిత్తశుద్ధితో పని చేస్తుందని, బాధితులకు అండగా ఉంటు ఫిర్యాదుల పై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్, ఐపీస్ అన్నారు.
సోమవారం రోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన ప్రజా ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజావాణి లో బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ, పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. మరియు పిర్యాదు దారులు సివిల్ వివాదాలను కోర్టులోనే పరిష్కరించుకో వలసిందిగా వారికి సూచించారు.
బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ శాంతిభద్రతల పరిస్థితులకు భంగం కలిగించేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.