భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం సోమవారం నాడు ఐటీడీఏ ముందు మూడు గ్రామ పంచాయతీ ఎన్నికల జీవో నెంబర్ 45ను అమలు చేయాలని కోరుతూ అలాగనే దుమ్ముగూడెం మండలం తునికి చెరువు రూట్ నుండి ఆర్లగూడెం మారాయిగూడెం చెరువుపల్లి రూట్ లో బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో దీక్షలను గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్ని మండలలో 500 జనాభా గల గ్రామాలను పరిపాలన సౌభల్యం కోసం గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగిస్తున్నారు. భద్రాచలంలో గత 30 సంవత్సరాల నుండి ఎన్నికలు నిర్వహించకుండా పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తూ వచ్చాయి gsp ఆధ్వర్యంలో రాష్ట్ర హైకోర్టులోరిట్ పిటిషన్ వేయడం మూలంగా2022. డిసెంబర్ 16వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం భద్రాచలం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జీవో నెంబర్ 45 ను విడుదల చేసిందని అన్నారు
జిల్లా అధికారుల నిర్లక్ష్యం మూలంగానే భద్రాచలం మూడు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదని విమర్శించారు
ఈ దీక్షలకు మద్దతు పలికిన వివిధ సంఘాల ప్రతినిధులు పొలిటికల్ ఐకాశా రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర ఆదివాసి లాయర్ల ఫోరం వైస్ ప్రెసిడెంట్ సున్నం రమేష్,మానవహక్కుల సంఘము జిల్లా అధ్యక్షులు ముత్తవరపు జానకిరామ్
తుడుం దెబ్బ సీనియర్ నాయకులు యాశం రాజు మన్య సీమ గిరిజన సంఘం సీనియర్ నాయకులు చిచ్చడి శ్రీరామ్ మూర్తి కొర్శచిట్టి బాబు దొర కుంజా దుర్గ కల్లూరి రాజమ్మ పాయం సన్యాసి సున్నం సుబ్బయ్య పాయం కామేష్ ఇర్పమల్లూరు బుర్ర రాజు కురుసంభద్రయ్య కురుశం లక్ష్మయ్య జంపన్న విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ ఇర్పాప్రకాష్ఈరోజు దీక్షలో పాల్గొన్నారు