-తొలి ప్రయత్నంలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డాక్టర్ సుమతి పోలేబోయిన
-పలువురు మహిళాలకు ఆదర్శ వంతురాలు
-చదువుకు పెళ్లి అడ్డురాదని నిరూపణ
-భర్త ప్రోత్సాహంతోనే
నేడు ఉన్నత ఉద్యోగం
-స్వదేశంలోనే శాస్త్రవేత్తగా ఎదిగి సేవలు చేయాలనే సంకల్పం
-రెండు తెలుగు రాష్ట్రల నుండి సెంట్రల్ యూనివర్సిటీ లో ఉద్యోగం సాధించిన తొలి ఆదివాసీ గిరిజన మహిళాగా ఘనత పేరు ప్రాఖ్యత
మంగపేట- నేటిధాత్రి
నిరు పేద గిరిజన కుటుంబం లో పుట్టి చదువు కోవడానికి ఆర్థిక స్థోమత సరైన సౌక ర్యాలు లేకున్న ఉన్నత చదు వు చుదువుకొని సమాజంలో మహిళాలు ఎందులోను తక్కువ కాదు అని ఉన్నత మైన స్థాయిలో ఉండలనే ఆమె దృడ సంకల్పంతో పెళ్లి అయిన కూడా భర్త కొమరం మోహన్ రావు ప్రోత్సాహంతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ను డాక్టర్ కొమరం సుమతి మోహన్ తొలి ప్రయత్నంలోనే సాదించి పలువురు మహి ళాలకు ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మారు మూల ఏజెన్సీ లోని మంగపేట మండలం రమణక్కపేట గ్రామంకు చెందిన కొమరం మోహన్ రావు (మాజీ సర్పంచ్) సతీమణి డాక్టర్ కొమరం సుమతిమోహన్ మొదటి ప్రయ త్నంలోనే (సిజి) రాష్ట్రం గురుఘాసి దాస్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సెంట్రల్ గవర్న మెంట్ ఉద్యోగం సాధించిన తొలి ఆదివాసి గిరిజన మహిళగా డాక్టర్ పోలేబోయిన సుమతి నిలిచారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పినపాక నియోజకవర్గం ఉమ్మడి పినపాక మండలం ప్రస్తుతం కరకగూడెం మండలం కొర్నూపల్లి గ్రామం కు చెందిన డాక్టర్ పోలేబోయిన సుమతి నిరుపేద ఆదివాసీ కుటుంబం లో పోలేబోయిన పుల్లయ్య, లక్ష్మి నర్సమ్మ దంపతులకు చిన్న కుమార్తెగా సుమతి జన్మించింది చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే పట్టుదలతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగి ఉన్నత చదువు అభ్యసించింది.పదో తరగతిలో 88.5% ఇంటర్ లో 91.3% మార్కులతో ఆమె విద్య అభ్యసం మొత్తం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది మరియు ప్రభుత్వ విశ్వ విద్యాలయలలో 2008 నుంచి 2012 వరకు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో బి ఫార్మసి 84.16%, మార్కులతో పూర్తి చేసింది తన చదువు మధ్య లోనే 2009 ఏప్రిల్ 29 న ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేటకు చెందిన కొమరం మోహన్ రావు తో వివాహం జరిగింది. పెళ్లి చదువుకు అడ్డు కాదని అస్సాం లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫార్మాసుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ లో యం.స్ 8.92 సీజీపిఏ తో మరియు.నేషనల్ ఇన్స్టి ట్యూట్ అఫ్ ఫార్మాసుటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ లో పీహెచ్డీ 9.67 సీజీపిఏ తో ఇప్పటి వరకు ఓటమి లేకుండా అన్నిటిలోను ప్రధమ శ్రేణిలో పాస్ అవుతు చదువు పూర్తి చేసింది.పీహెచ్డీ పూర్తి అయిన తదనంతరం ప్రస్తుతం బి.వి. రాజు విద్య సంస్థలకు (బి విఆర్ఐటీ) కు చెందిన విష్ణు ఇన్స్టిట్యూట్ అఫ్ ఫార్మా సుటికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలు అందిస్తున్నారు.
భర్త ప్రోత్సాహంతోనే ఉన్నత ఉద్యోగం
తన భర్త ప్రోత్సాహంతోనే ఉన్నత చదువు చదువుకొని నేడు సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించానని అన్నారు.తను చదువుకునే సమయంలో ఓ
బిడ్డకు కూడ జన్మను ఇచ్చిన తన బిడ్డ అలాన పాలనా చూసుకుంటునే చదువుకునే దానినని ఒక్కోసారి కళాశాల నుంచి ఇంటికి వెళ్లి ఇంట్లో పని మరియు బిడ్డ అలాన పాలనా చూసుకోని చదుకొని నిద్ర పోయే వరకు తెల్ల వారు జాము 3 గంటలు అయ్యేదని తెలిపింది.ఎన్నోసార్లు ఇబ్బంది అయి, చదువు ఆపేద్దాం అనే అనుకున్న కానీ నా భర్త ప్రోత్స హించి అండగా ఉన్నాడని, నేనున్నా అంటూ ప్రోత్సా హాన్ని ఇచ్చి ముందుకు నడిపించాడని తెలిపారు.
సంకల్పం ఉంటే పెళ్లి అడ్డు కాదు
పెళ్లి అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిగా పోరాటం చేసి తాను అనుకు న్నది సాధించాలనే పట్టుద లతో తన భర్త కొమరం మోహన్ రావు ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఉన్నత చదువులు చదివి నేడు సెంట్రల్ గవర్న మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించానని చాలా మంది మహిళలు మాకు పెళ్లయింది మేమేం సాధించ లేం అంటూ చదువు మధ్య లోనే మానివేసి నిరుత్సాహంతో ఉంటున్నా రని చదువు కోవాలనే పట్టు దల భర్త ప్రోత్సాహం ఉంటే ప్రతి మహిళ సమాజంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధిస్తారని అన్నారు.
డాక్టర్ కొమరం సుమతి మోహన్ మనసులోని మాట
శాస్త్రవేత్తగా (సైంటిస్టుగా) ఎదగాలి అనేది నా లక్ష్యం ప్రపంచంలో ఉన్న మాన వాళిని వివిధ రకాల వ్యాధుల నుంచి కాపాడాలని లక్ష్యంతో వివిధ వ్యాధుల నిర్మూలనకు తన వంతు కృషి చేయాలని వాటి పై పలు రకాల పరిశో దనలు చేసి కొమరం భీమ్ వారసురాలిగా ఆయన ఆశయా సాధనలతో,సంకల్ప లక్ష్యాలతో ముందుకు సాగుతూ పేద ప్రజలకు సేవా చేయడమే నా జీవిత ఆశయం అని తెలిపారు.