నేల సంరక్షణ పై అవగాహన.

రామాయంపేట (మెదక్)నేటి ధాత్రి.

ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా రైతులకు నేల సంరక్షణ, భూసార పరిరక్షణ, జీవన ఎరువుల వాడకం, సేంద్రీయ కర్బన పదార్థల పెంపు, మట్టి నమూనా సేకరణ, మృతిక పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం, పై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజ నారాయణ మాట్లాడుతూ రైతు యొక్క ఆదాయం పెరిగే క్రమంలో పంటల దిగుబడి ముఖ్య భూమిక పోషిస్తుందని పంటల దిగుబడి సారవంతమైన నేల ఆరోగ్యాన్ని బట్టి ఆధారపడుతుందని రైతుల యొక్క ఆదాయం పెరగాలంటే తప్పనిసరిగా పంటలు దిగుబడి పెరగాలని కానీ ప్రస్తుతం రైతులు పంటల దిగుబడి పెంచే క్రమంలో మోతాదుకు మించి ఎరువుల వాడకం వల్ల భూమి కాలుష్యం చెంది భూమిలోని పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు యొక్క సంతతి క్రమంగా క్షీణిస్తుందని అదేవిధంగా నేలలో సేంద్రియ కర్బన పదార్థం తగ్గడం వల్ల పంటల దిగుబడి క్రమక్రమంగా తగ్గుతుందని మోతాదు మించి ఎరువులు వాడడం వల్ల భూమిలో లవణ సాంద్రత పెరిగి మరియు చౌడు పెరిగి దీర్ఘకాలంలో పంటల దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. పెరుగుతున్న జనాభా తగ్గట్టుగా పంటలు దిగుబడి పెంచాలంటే తప్పనిసరిగా నేల ఆరోగ్యాన్ని కాపాడాలి ఇందులో భాగంగానే వేసవి దు, వానకాలంలో పచ్చిరొట్ట పంటల పెంపకం మట్టి నమూనా పరీక్ష చేయించుకోవడం, వాటి ఫలితాలు ఆధారంగా మాత్రమే నియమిత మోతాదులో ఎరువులు వాడుకోవడం రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులను వాడటం వంటి దీర్ఘకాలిక సమగ్ర పోషక యజమాన్య పద్ధతులు పాటించినప్పుడే రైతుల యొక్క పంటలు దిగుబడి పెరిగి తద్వారా రైతు యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సతీష్ ,వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సాయి కృష్ణ, రాజు, తేజస్వి, స్రవంతి, మరియు రైతులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *