కూచూరు గ్రామ కాంగ్రెస్ నాయకులు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని
కూచూరు గ్రామ యువకులు అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం జనంపల్లి అనిరుద్ రెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించడానికి కార్యకర్తలు నిద్రాహారాలు మాని గ్రామంలో మొత్తం టిఆర్ఎస్ మయంగా ఉన్న గ్రామాన్ని . యువనాయకులు, కూచూరు గ్రామాన్ని టిఆర్ఎస్ కి ఏమాత్రం తగ్గకుండా మనస్పర్ధలు లేకుండా అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను వివరించి కూచూరు గ్రామంలో కాంగ్రెస్ జెండాని విజయకేతనం ఎగిరే దిశగా కృషి చేశారు.. ఎంతోమంది వెటకారంగా మాట్లాడిన ప్రలోభాలకు లొంగకుండా పనిచేశారు.
గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు అందరి సహకారంతో జనంపల్లి అనిరుద్ రెడ్డి ని గెలిపించుకొని సంబరాలు నిర్వహించారు. నూతన ఎమ్మెల్యే కి అభినందనలు తెలియజేస్తూ, గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో తనేం,సురేష్ అనోక్ సామెల్ పెద్ద శేఖర్. సునీత ,సంతోష్, నర్సింలు గౌడ్, చిట్టి రాజు, ఎస్ యాదయ్య, సర్దార్ కర్రి అశోక్. తదితరులు పాల్గొన్నారు.
