నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని చౌటుపర్తి గ్రామంలో జై హనుమాన్ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఏపీఎం రమాదేవి.అనంతరం మాట్లాడుతూ రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.మొదటి రకం వరి ధాన్యానికి రూ.2203,రెండవ రకానికి రూ.2183 చొప్పున ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో వేస్తుందని పేర్కొన్నారు.ప్రస్తుతం మార్కెట్లో ఏ పంటకు విలువ ఉందో తెలుసుకొని దానికి అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిసి జన్ను కుమారస్వామి, వివో అధ్యక్షురాలు రమ, వివో ఏ తిరుమల, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.