నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు, ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్స్, విద్యా వాలంటీర్లు, ఐఆర్పి నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోని(ఎన్ ఎఫ్ సి హెచ్) సంస్థ యొక్క ఫ్లాగ్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల నుండి ఉపాధ్యాయుల నుండి విరాళాలు సేకరించి శుక్రవారం రోజున ఆ సంస్థకు 3700/- రూపాయలు ఫోన్ పే చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోని అనేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పనిచేసే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అని, ఈ సంస్థ ప్రతి సంవత్సరం నవంబర్ 19 నుండి 25 వరకు మతసామరస్య ప్రచార వారన్ని నిర్వహిస్తుందని, నవంబర్ 24న ఫ్లాగ్ డే ను నిర్వహిస్తారని అన్నారు. ఈ ఫ్లాగ్ డే సందర్భంగా సేకరించిన విరాళాలతో మతపరమైన, కుల,జాతి లేదా తీవ్రవాద హింసకు గురి అయిన బాల, బాలికలకు సమర్థవంతమైన పునరావాసము, ప్రాజెక్టు సహాయం కింద వారి సంరక్షణ, విద్య కోసం సహాయాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. ఇంతటి బృహత్తరమైన కార్యక్రమానికి చర్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్, విద్యా వాలంటీర్లు ఐఆర్పి, విరాళాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్, నిగ్గుల శ్రీదేవి అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మి, నందిపాటి సంధ్య ఐఆర్పి రమేష్, విద్యా వాలంటీర్లు బాబురావు,పరిషవేణి జ్యోతి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.