
హనుమకొండ
శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని క్యాంటీన్ ఆవరణలో అన్ని విద్యార్ధి సంఘాల అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాకతీయు యూనివర్సిటీ ఎంఎస్ యు ఐ ప్రెసిడెంట్ పాషా మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీలో ఇన్ని రోజులు జాక్ పేరుతో చెలమని అవుతూ పబ్బం గడుపుతూ, టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తూ, కాకతీయ యూనివర్సిటీ పేరును చెడగొట్టి, కాకతీయ యూనివర్సిటీ లోని విద్యార్థి సంఘాల నాయకులను నిర్వీర్యం చేస్తూ విద్యార్థులను ఇన్ని రోజులు తమ కార్యక్రమాల కోసం వాడుకొని, తమ స్వార్థం కోసం కాకతీయ యూనివర్సిటీలో అడ్మిషన్ లేకుండా కొందరు ఉండి కొందరు ఇటీవలే టిఆర్ఎస్వి పార్టీ లో జాయిన్ అవ్వడం జరిగింది. దీనిని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరందరూ భవిష్యత్తులో ఎక్కడా కూడా యూనివర్సిటీ సంఘాల పేరు జాక్ పేరును చెప్పుకో కూడదు, ఉద్యమ ద్రోహులు మీరు. మీతో మా విద్యార్ధి సంఘాలకు ఇలాంటి సంబంధం లేదు అయినా విద్యార్థుల నాయకులు తెలిపారు. మేమంతా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన అండగా ఉంటామని, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఇట్ట బోయిన తిరుపతి యాదవ్, రాజు నాయక్, విజయకన్నా, మేడారంజిత్ వీళ్లను నమ్మకండి, ఉద్యమ ద్రోహులు వీళ్లు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి డాక్టర్ వడ్డేపల్లి మధు, నిరుద్యోగ జాక్ నాయకులు, సోల్తి కిరణ్ గౌడ్, మాల సంఘం నాయకులు డాక్టర్ చందు, డాక్టర్ రవీందర్, డాక్టర్ సురేష్,రాజు,అనిల్ సునీల్,తదితరులు పాల్గొన్నారు.